భీష్ముడికే తప్పలేదు

 

 

 

అసతాం సంగదోషేణ సాధవో యాంతి విక్రియాం।

దుర్యోధనప్రసంగేన భీష్మో గోహరణే గతః

మనం ఎంత మంచివారమైనా కావచ్చు. కానీ దుష్టుల సాంగత్యం ఉంటే కనుక వారి దోషాన్ని మనం కూడా భరించక తప్పదు. గతంలో భీష్ముడంతటి వాడు దుర్యోధనునితో కలిసి గోవులని అపహరించాల్సి వచ్చింది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాల్సిందే!


More Good Word Of The Day