ఎవరితో ఎలా ఉండాలి

 

 

దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే

ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవమ్‌ ।

శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టతా

యే చైవం పురుషాః కళాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ॥

భర్తృహరి ఈ పద్యంలో ఎవరితో ఎలా మెలగానే విషయం గురించి తగిన సూచనలందిస్తున్నారు.మనవారు అనుకున్నవారి ఎడల దయను చూపాలి. మనకి వ్యతిరేకంగా ఉన్నవారి ఎడల కాఠిన్యంగా ఉండాలి. మంచివారిపట్ల ప్రీతిపాత్రంగా మెలగాలి. రాజుల ఎడల విధేయంగా ఉండాలి. పండితులతో గౌరవంగా మెలగాలి. శత్రువుల పట్ల బలపరాక్రమాలను ప్రదర్శించాలి. పెద్దలంటే ఓర్పుగా ఉండాలి. స్త్రీల దగ్గర వీరత్వంతో ప్రవర్తించాలి. ఇలాంటి లక్షణాల  వలన అతనికే కాదు, లోకం క్షేమంగా ఉంటుంది.


...Nirjara


More Good Word Of The Day