మాటతో తపస్సు

 

 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ !

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయమ్ తప ఉచ్యతే !!

మన మాటని పరిశుద్ధం చేసుకోవడం కూడా ఒకవిధమైన తపస్సే అని శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. అందుకోసం ఉద్వేగం లేకుండా, ఇతరులకు మనసు నొప్పించకుండా, వారికి మేలు కలిగించే మాటలే మాట్లాడాలట. దానితో పాటుగా జ్ఞానసంబంధమైన పుస్తకాలనూ పఠించాలట. ఇలాంటి చర్యలన్నీ వాచికమైన తపస్సుగా గీతాకారుడు పేర్కొంటున్నాడు.


More Good Word Of The Day