ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి?

ఏకాదశి పవిత్రమైన రోజు. ముక్కోటి ఏకాదశి...పరమ పవిత్రమైన రోజు. ఆ రోజున ముక్కోటి దేవతలు కలిసి శ్రీమాన్నారాయణుని దర్శించుకుంటారట. అందుకే... ఆ రోజుకు అంతటి ప్రాముఖ్యం. మధుకైటవులు అనబడే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి, వారికి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ రోజే ప్రసాదించాడు శ్రీమహావిష్ణు. అందుకే.. ఈ రోజున భక్తులంతా ఉత్తర ద్వార ముఖంగా స్వామి దర్శించుకుంటే సకలైశ్వర్యాలూ సిద్ధిస్తాయ్. అంతేకాదు... ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుడ్ని శ్రీవారు సంహరించారు. ఆ మురాసురుడు ఈ రోజున అన్నంలో ఉంటాడని నమ్మకం. అందుకే... వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. కేవలం తులసి నీళ్లే స్వీకరిస్తారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడున్న లింక్ ని క్లిక్ మనిపించండి. 

 


More Purana Patralu - Mythological Stories