తిరుమలలో అంగప్రదిక్షణ

 

వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .

 

Information on Entry for Angapradakshina Tirupati Balaji Darshan

అంగ ప్రదక్షణకు వెళ్ళాలనుకునేవారు మధ్యాహ్నం పన్నెండింటికల్లా కొండమీదకు చేరాలి. వెంటనే భోజనానికి దేవస్థాన సత్రంలోనో మరోచోటో ముగించుకుని, టికెట్లు ఇచ్చే C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ వెతుక్కునే సరికి మధ్యాహ్నం 2 అవుతుంది.  ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో అందరూ లైన్ లో నుంచోవాలి. దాదాపు నాలుగు గంటల సమయానికి టికెట్స్ ఇస్తారనుకుంటా. మధ్య మధ్యలో వేరేవాళ్లు అక్కడ కట్టిన ఇనుప కర్రల పైనుండి దూకేసి మరీ మనకంటే ముందుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఖండించక పోతే టికెట్స్ దొరకనట్టే. కనుక వందల మంది ఎదురుచూసే ఆటికెట్ కోసం ఖచ్చితంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తే మంచిది.

 

Information on Entry for Angapradakshina Tirupati Balaji Darshan

టికెట్స్ తీసుకున్నాకా సాయంత్రం పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకోండి. ( స్వామి దర్శనానికి ముందే వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. లేక పోతే దర్శన ఫలం ఉండదు ) చుట్టుప్రక్కల ఉన్న మిగతా దేవాలయాలు,ఆశ్రమాలు దర్శించుకోండి.  ఆరోజు రాత్రికి భారీ ఆహారం తీసుకోకండి. అలా తీసుకుంటే ప్రదక్షిణలు మనం మూడు గంటల సమయంలో చేస్తాం కనుక ఆహారం సరిగా అరుగదు. మనం పొర్లడం వలన వాంతులు అవుతాయి కనుక అల్పాహారం తీసుకోవడం మరవద్దు.  రూము దొరికితే ఫర్వాలేదు. దొరక్క పోయినా మరేమీ కంగారు పడనవసరం లేదు. రాత్రి పన్నెండైనా ఇంకా భజనలు, హరికథలు సాగుతుంటాయి దేవాలయం చుట్టుప్రక్కల.  రాత్రి పన్నెండున్నరకు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒంటిగంట కల్లా అంగప్రదక్షిణకు వెళ్లే లైన్ వద్ద నుంచోవాలి. లైనులో మొగవారైతే దాదాపు రెండుగంటలు వేచి ఉండాలి. ఆడవారు గంటన్నర. ఆసమయం వృధా చేయకుండా స్వామి మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి.

 

Des: Latest collection of funny,inspirational & love blind jokes online  Keywords: Funny Blind Jokes, Fun is life Blind Jokes, Latest Jokes Laugh

అందుకని చేతిలో గోవిందనామాల కాగితం పెట్టుకుని బిగ్గరగా మీరు చెప్తూ మీస్నేహితుల చేత చెప్పించండి. అది విని మిగతావారు చెప్తారు. చక్కగా లైన్ లో ఉన్నంత సేపూ మొహమాటపడకుండా భగవన్నామాన్ని పలకండి. స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం ఆరవుతుంది. లడ్డు పదిరూపాయలు పెట్టి కొనుక్కుని బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి.  సంధ్యావందనాదికాలు ముగించుకుని అల్పాహారం సేవించి, ఆరోజు దర్శనం జరిగిన విధివిధానాన్ని నెమరు వేసుకుంటూ  క్రిందకు రండి

 


More Venkateswara Swamy