• Prev
  • Next
  • Konte Questions-Tuntari Jawabulu-5

    This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

    కొంటె కొశ్శెన్లు - తుంటరి జవాబులు -5

    *******************************************************************

    వి.మంజురాణి,హైదరాబాద్.

    కొంటె కొశ్శెన్ : అతి జాగ్రత్త పరుడైన షుగర్ పేషెంట్ ?

    తుంటరి జవాబు : ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నా షుగర్ టెస్ట్ చేయించుకునేవాడు.

    *******************************************************************

    కొంటె కొశ్శెన్ :కండక్టర్ ఆశ్చర్యపోయేదెప్పుడు ?

    తుంటరి జవాబు :నువ్వు ఎంగిలి చేసిన తెక్కెట్లు నాకు వద్దు అని ప్రయాణం చేసేవారు అన్నప్పుడు.

    *******************************************************************

    కొంటె కొశ్శెన్ :ఫోటోగ్రాఫర్ విస్తుపోయేదెప్పుడు ?

    తుంటరి జవాబు :బురఖాలు వేసుకున్న స్త్రీలు వచ్చి అందంగా ఫోటో తీయమన్నప్పుడు.

    ******************************************************************

    కొంటె కొశ్శెన్ :అసలైన అహింసవాది?

    తుంటరి జవాబు :చెయ్యెత్తి జై కొట్టడానికి కూడా భయపడేవాడు.

    *****************************************************************

    కొంటె కొశ్శెన్ :కథ చెబుతున్నప్పుడు ఎందుకు "ఊ "కొడతారు ?

    తుంటరి జవాబు :ఆ..అంటే మళ్ళీ మొదట్నీనుంచీ మొదలు పెడతారని.

    ******************************************************************

    కొంటె కొశ్శెన్ :పొయ్యిలోణి పిల్లి కదల్లేదు అంటే అర్థం ఏమిటి ?

    తుంటరి జవాబు :ఆ ఇంట్లో ఎలుకలు అస్సల్లెవని.

    ******************************************************************

    కూర్మాన వెంకట సుబ్బారావు,విశాఖపట్నం.

    కొంటె కొశ్శెన్ : పరమ సందేహ ప్రాణి అంటే ఎలా వుంటాడు ?

    తుంటరి జవాబు :దొంగలు పడితే తెలియజేయడానికి కుక్కను పెంచుకుందామండీ అని భార్య

    అడిగితే,ఆ టైముకు అది గట్టిగా అరుస్తుందని నమ్మకం ఏంటి అని తప్పించుకునేవాడు.

    *****************************************************************

    బి.మోక్షానందం,ఉప్పలపాడు

    కొంటె కొశ్శెన్ :ప్రేమ విలువ తెలిసేదేప్పుడు ?

    తుంటరి జవాబు :పర్స్ ఖాళీ అయినప్పుడు.

    *******************************************************************

    (హాసం సౌజన్యంతో)

  • Prev
  • Next