లెక్క తప్పింది!

 

లెక్క తప్పింది!

 

లెక్కల టీచరుగారు ఆవేళ పిల్లల్ని ఎలాగైనా పరీక్షించాలనుకుని క్లాసులో అడుగుపెట్టారు..

తరగతిలో ఉన్న పిల్లల్లో ఒక మూల బిక్కుబిక్కుమంటూ చింటూ కనిపించాడు.

టీచర్‌: చింటూ ఇవాళ నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరిగ్గా జవాబు చెప్పాల్సిందే. నీ దగ్గర ఒక అయిదు రూపాయలు ఉన్నాయనుకో. మీ నాన్నగారిని ఇంకో అయిదు రూపాయలు ఇమ్మని అడిగావనుకో. నీ దగ్గర ఇప్పుడు ఎన్ని రూపాయలు ఉంటాయి.

చింటూ: అయిదు రూపాయలే ఉంటాయి సార్‌!

టీచర్: నీకు అసలు లెక్క తెలియడం లేదు. అయిదు రూపాయలకి అయిదు రూపాయలు కలిపితే పది రూపాయలు అవ్వవా!

చింటూ: నాకు లెక్క తెలియకపోవడం కాదు. మీకే మా నాన్న గురించి తెలియదు. ఆయన ముందు ఎంత గింజుకున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఇంక నా దగ్గరకి డబ్బులెలా వస్తాయి!!!