పరారీలో అతిథి

పరారీలో అతిథి

 

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
. ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
.అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో
కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
.
అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
.తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే
కూర్చుంటాను’’
.తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
.అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే
కూర్చుంటాను’’
. అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.
.కొద్దిసేపు తరువాత....
. తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా..
పాలు తీసుకుంటారా?’’
. అతిథి : ‘‘టీ’’
.తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
. అతిథి : ‘‘వద్దు వద్దులెండి..
.నేను పాలు తీసుకుంటాను’’
.
తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని
రామ్మా’’
.
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి
పారిపోతాడు........