Padandi Manduku

 " పదండి మందుకు ! ”

-గోపి

మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న నారీమణులు కొందరు తమ ప్లాట్స్ లో ఉన్న మగాళ్ళ చేట మందు మానిపించేయాలని కంకణం కట్టుకుని ముందస్తుగా ఓ ప్లాట్ కి వెళ్లారు.

ఆ ప్లాట్ రైల్వే లో పని చేసి రిటైరైన ఓ పెద్ద మనిషిది.నారీ జనం వెళ్ళే సరికి ఆ పెద్ద మనిషి తీరిగ్గా ఈజీ చైర్ లో కూర్చుని ఉన్నాడు.

“అన్నయ్య గారూ !మీరు చివరిసారిగా మద్యం ఎప్పుడు పుచ్చుకున్నారు?”అంటూ ఓ చెల్లెమ్మ డైరక్టుగా పాయింటుకి వచ్చేసింది.

ఆ పెద్ద మనిషి కాసేపు ఆలోచించి "1955 కాబోలు "అన్నాడు.

చెల్లెమ్మ తెగ సంతోష పడిపోయి "అమ్మయ్య..అప్పట్నించీ మీరు పూర్తిగా మందు మానేసి నట్టేనా ! మళ్ళీ పుచ్చుకోరు కదా " అని ఆరాటంగా అడిగింది.

ఆ పెద్ద మనిషి గాఢంగా నిట్టూర్చి "మరీ అంత ఖచ్చితంగా చెప్పలేను కానీ...” అంటూ రిస్టు వాచీ చూసుకుని "ఏదీ...ఇప్పుడింకా 2015 కదా అయిందీ...”అంటూ వెనక్కివాలాడు.