తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ జోక్స్

 

తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ జోక్స్

 

 

 

ఓ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఆ చిత్ర దర్శకుడి చేతిలో చిన్నచిన్నపాకెట్స్ ఉండటం

చూసి "డైరక్టర్ గారూ ... మీ చేతిలో ఆ పాకెట్స్ ఏమిటి ?” అని అడిగాడు నిర్మాత.

“మీరే కదా సార్ ... మన చిత్రంలో అన్ని మసాలాలు ఉండాలన్నారు కదా. అందుకనే

ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుండి మసాలాలు తెప్పించాను" అని

చెప్పి నాలిక్కరుచుకున్నాడు దర్శకుడు.

***

“నేనిప్పటి వరకు విమానం ఎక్కలేదు. ఒకవేళ ఆకాశంలో విమానం ఆగిపోతే మనమేమి

చేయాలి?" అయోమయంగా అడిగాడు హరి విమానం ఎక్కబోతూ.

“మనమిద్దరం దిగి దానిని తొయ్యాలి" నవ్వుతూ చెప్పింది ఎయిర్ హోస్టస్.

అంతే! పెద్దగా ఏడుస్తూ నోరు తెరిచాడు.

***

“గురువులను పూజించవలెను. తెలిసిందా?” అన్నాడు మాస్టారు.

“పూజిస్తే ప్రసాదం పెడతారా మాస్టారూ..” అడిగాడో తిండిబోతు విద్యార్థి ఆశగా.

***

రామనాధం అనే రచయిత దగ్గరికి సుబ్బారావు వచ్చి "మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా

... నా కూతురుకి లవ్ లెటర్ రాశాడు. ఇది మంచి పద్దతి కాదు" అన్నాడు కొంచం

ఆవేశంగా.

ఆ రచయిత పకపక నవ్వి "రిప్లై కవర్ పెట్టాడా?” అన్నాడు.

“ఆఁ.”అని నోరు తెరిచాడు సుబ్బారావు.