భర్తగా బ్రతకడం కష్టం..

భర్తగా బ్రతకడం కష్టం..

 

 

భర్త  ::  నేను  నిన్న స్కూల్  కి చేరుకోగానే, నా బార్య కాల్ చేసింది,.... " ఇవ్వాల డేట్ ఎంత" ????" 

నేను ఆశ్చర్యంగా ఆలోచిస్తూ చెప్పాను 11వ తారీఖు అని...

కాల్ కట్ అయ్యాక ఆలోచనలో పడ్డాను
(భయం కూడా కలిగింది.. )..
తన పుట్టిన రోజా ఊహు?...........కాదు
......నా పుట్టినరోజు  కాదు ..
.....పెళ్లి రోజు..ఊహు  ....  అదీ కాదు
అమ్మాయి పుట్టిన రోజా  ... అదీకాదు
పోనీ బామర్దుల పుట్టినరోజులు కాని పెళ్లి రోజులు .. ఊహు
గాస్ బుకింగ్ ........ చేసేసాను
కరెంటు బిల్లు ........ కట్టేసాను

వాళ్ళ అమ్మ నాన్నలు వస్తామన్నారా  అది కాదు
పోనీ ఏదైనా కొనిపెడతానని మాటిచ్చానా .. లేదే..??

మరి ఎందుకు !?

డేట్ ఎందుకు ???

ఇవే ప్రశ్నలు మదిలో ఆలోచిస్తూ  లంచ్ అయ్యింది,  సాయంత్రం స్కూల్ అయిపోయింది
...
ఇంటికి చేరుకున్నాను...

పాప తన బొమ్మలతో ఆడుకుంటుంది ...
అడిగాను ....
కిచెన్ లో వాతావరణం ఎలా ఉంది?
తుఫానా.. సునామినా???

పాప చెప్పింది అంత మామూలే నాన్న ఏమైంది ఎందుకు ?"

"మీ అమ్మ ఈరోజు పొద్దునే ఈ రోజు డేట్ ఎంత అని అడిగిందే ఎందుకంటావు?"

పాప నవ్వుతూ  చెప్పింది ...

"ఓహ్ అదా నాన్న నేను పొద్దున్న క్యాలెండర్ లోని ఒక పేజి చింపా...

అందుకే అడిగిందేమో.."


భర్తగా బ్రతకడం కష్టంరా బాబోయ్..