Home » Comedy Stories » Telugu Comedy Story - Govinda Govinda

Rating:             Avg Rating:       380 Ratings (Avg 2.96)

గోవిందా..... గోవింద.....!

గోవిందా..... గోవింద.....!

- పద్మశ్రీ

అదేమిటీ...? ఉన్నఫళంగా తిరుపతికి తీసుకెళ్ళారు....? అని కంగారు పడుతున్నారా...

'గోవిందా’ అనగానే మీరు తిరుపతి కొండెక్కేస్తే నేనేం చేసేది...

ఇంతకీ విషయమేమిటంటే... గోవిందా... అంటే బాలీవుడ్ హీరో, పొలిటికల్ లీడరు అయిన గోవిందా గురించి.

ఆ...ఆ... గుర్తొచ్చిందా.... అతడే...!

హీరోగా ఎన్నో సినిమాలలో నటించి అన్యాయాన్ని, అక్రమాల్ని ఎదిరించే ధీరోదాత్త పాత్రలలో కనిపించాడు.

అందరినీ కడుపుబ్బ నవ్వించాడు హాస్య సినిమాల్లోనూ నటించి పేరు సంపాదించాడు.

మొత్తానికి బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని వేసుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది...

అయితే షరా మామూలుగానే అందరు హీరోలలానే సినీ ఫీల్డ్ లో కొనసాగుతూన్న సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది.

మరింకెందుకు ఆలస్యం అంటూ మహారాష్ట్రలోని ములాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.

ఎంతైనా సినిమా వాడు, పైగా తన సినిమాలతో పగలబడి నవ్వించాడు కదా... రాజకీయాల్లో కూడా అలాగే నవ్వుతూ ప్రజలకి మంచి చేస్తాడని భావించి ఆయన్ని పార్లమెంటు సీటెక్కించారు.

అక్కడే ఆ నియోజకవర్గం ప్రజలు తప్పులో కాలేసామని తెలుసుకున్నారు. ఏదో వెలగబెడతాడని తాము గోవిందాని గెలిపిస్తే ఆయన మాత్రం గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా తనను గెలిపించిన ప్రజల మోహాలను చూడ్డానికి వెళ్ళలేదు. హాయిగా ఎంచక్కా తన సినిమా షూటింగులతో తెగ బిజీ అయిపోయి ప్రజలని మరిచిపోయాడన్నమాట.

ఆయన బాధని అర్థం చేసుకుని ఇవ్వాళ కాకపొతే రేపైనా వస్తాడు గదా అనే ఆశతో, సహనంతో ఎదురు చూసీ, చూసీ విసిగిపోయారు జనాలు.

ఇంక తమ గోవిందా తెరపైనే కానీ తమముందుకి వచ్చేలా లేడని నిర్ధారించుకున్న జనం ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించేశారు.

ఎందుకో తెలుసా? కనిపించకుండా పోయిన తమ ఎం.పి. గోవిందాని పట్టుకొచ్చిన వారికి అక్షరాలా కోటి రూపాయలు నజరానా అని గోవిందా ఫోటోతో పెద్ద కటౌటు పట్టుకుని వీధి వీధిలో తిరిగారు.

ఈ సంగతి తెలిసిన గోవిందాకి బి.పి. రెయిజైపోయింది.

ఎంచక్కా షూటింగ్ లు చేసుకుంటూ హాయిగా ఉన్న తనకు ఆఫ్ట్రాల్ ఓ పార్లమెంటు సీటు ఇప్పించినందుకు తనపైనే కోటి రూపాయల నజరానా ప్రకటిస్తారా? అనుకుని తెగ ఫీలయిపోయి... అసలేం చేస్తున్నాడో తెలియని విధంగా తన షూటింగ్ చూడడానికి వచ్చిన ఓ అభిమాని చెంప చెళ్ మనిపించాడు.

ఇంత టెన్షన్ పడే బదులు.... కనీసం ఆర్నెల్లకోసారైనా తనని గెలిపించిన జనాల ముందు ప్రత్యక్షమయి వారితో కాసేపు మాటామంతీ జరిపి వస్తే యవ్వారం ఇంతదూరం వచ్చేది కాదు గదా....

ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు పాపం... గోవిందా...!