Telugu Comedy Kavithalu

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

Telugu Comedy Kavithalu

*******************************************************************

నా స్నేహితుడి పేరు చారి

హోటల్ కి రమ్మన్నాడో సారి

వెళ్ళేసరికి తింటున్నాడు పూరి

నన్ను కూడా తినమన్నాడు శతపోరి

నాలిక పీకింది నోరూరి

తిన్నదొకటే ప్లేటు మరి

అయినా బిల్లోచ్చింది వాడి బిల్లుతో చేరి

డబ్బుల్లేవంటూ చెప్పాడువాడు సారి

దేవుడా ఇప్పుడు నాకేమి దారి

హోటల్ వాడు నాకు కట్టించకముందే గోరి

మెల్లగా వంటింట్లోకి దూరి

బైటపడ్డా నాలుక్కిలోల పప్పునూరి.

*******************************************************************

నా మరదలి పేరు వరం

తనకు కావాలట ఓ పెద్ద సవరం

కనుక తనే చేస్తానంటోంది నాకు క్షవరం

నాకు భయం తెగుతుందేమోనని

నా మెడ దగ్గర నరం

అందుకే ఆమె పేరు చెబితే

మనకెప్పుడూ నూట నాలుగు జ్వరం.

పి.యస్.రాజు రావికంపాడు

*******************************************************************

మా యింటి ముందున్న మడేలు

బాగా వాయిస్తాడు ఫిడేల

అతని శృతి వింటే చాలు

సహకరిస్తాయి గార్దభాలూ,తోడేళ్ళు.

రాగం ఆలపిస్తే చాలు

భూతాలు,ప్రేతాలూ వినిపిస్తాయి

వెనువెంటనే మృత్యు గీతాలు

అతని సంగీతం వల్లే

ఇరాన్ లో భూకంపాలూ!

ఇరాక్ లో బాంబు పేలుళ్లు!

అంటారు ఇరుగు పొరుగు జనం

వారికేం తెలుసు అతని వల్ల ప్రయోజనం

సరిహద్దుల్లో అతన్ని పెట్టేస్తే కాపలా

శత్రువెవరైనా చచ్చురుకుంటాడుగా కాలు పెట్టే లోపల!!

కూచిపూడి జయచంద్ర.

(హాసం సౌజన్యంతో)