టీచర్స్ డే స్పెషల్ జోక్స్...

 

ఆబ్సెంట్‌
తల్లి- ఎప్పుడూ లేనిది ఈసారి ఇంత తక్కువ మార్కులు వచ్చాయేంటి?
కొడుకు- పరీక్ష రోజున బడికి వెళ్లకపోవడం వల్ల మార్కులు బాగా తగ్గాయి.
తల్లి- అదేంటి పరీక్షల్లో నువ్వు సరిగానే బడికి వెళ్లావు కదా!
కొడుకు- నేను చెబుతోంది నా పక్క సీట్లో ఉండేవాడి గురించి...

గాడిద బరువు
ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులు రాసిన జవాబు పత్రాలన్నింటినీ తీసుకుని వెళ్తున్నాడు. దారిలో ఒక కొంటె కుర్రవాడు ఎదురుపడి- ‘సార్‌! పాపం గాడిద బరువు మోస్తున్నట్లున్నారే!’ అని ఎగతాళిగా పరామర్శించాడు. దానికి ఉపాధ్యాయుడు తడుముకోకుండా- ‘ఒక్క గాడిద బరువేం ఖర్మ. నా క్లాసులో నీతో పాటు యాభై మంది ఉన్నారు. ఆ యాభై గాడిదల బరువూ మోస్తున్నాను నాయనా!’ అని బదులిచ్చాడు. పాపం ఆ జవాబు విన్న తరువాత విద్యార్థి కిక్కురుమనకుండా తప్పుకున్నాడు.

కాపీ కాదు
గురువుగారు- కుక్క గురించి వ్యాసం రాయమంటే, నువ్వు మీ అన్నయ్యా ఒకేలాగా రాసుకుని వచ్చారేంటి!
విద్యార్థి- మా ఇంట్లో ఒకే కుక్క ఉంది టీచర్‌. ఇద్దరం దాన్ని చూసే రాశాము...

పంజాబు
గురువుగారు- పంజాబు ఏ పంటకు ప్రసిద్ధి?
విద్యార్థి- తెలియదండీ!
గురువుగారు- పోనీ గోధుమ పిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
విద్యార్థి- ఓ! మా పక్కింటివాళ్లని అడిగితే వస్తుంది.

పాలన
గురువుగారు- అక్బరు మన దేశాన్ని ఎప్పుడు పాలించాడు?
విద్యార్థి- మా పుస్తకంలో 52వ పేజి నుంచి 55వ పేజి వరకూ పాలించాడు సర్‌!