Ninety Six Abadhalu Nastapoyaanu

96 అబద్ధాలు నష్టపోయాను

కృష్ణ పెళ్లి నవ్యతో జరిగి సంవత్సరం దాటింది. నెమ్మది నెమ్మదిగా కృష్ణ చెప్పేటివి అన్ని

అబద్ధాలు అని నవ్యకి అర్థమయింది.

దాంతో ఒకరోజున కృష్ణని నిలదీసింది నవ్య.

" మీరు నన్నుమోసం చేసారు. మీరు తిరుగుబోతునని, పేకాటరాయుడినని, అబద్ధాల

రాయుడినని, నిరుద్యోగినని చెప్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి

చేసుకున్నారు. ఇది నమ్మకద్రోహం, దగా " అంటూ కోపంగా గట్టిగా అరిచింది నవ్య.

" ఇందులో నా తప్పేముంది పిచ్చిదానా ? వంద అబద్దాలాడైన ఒక పెళ్లి చేసుకోమన్నారు

పెద్దలు. నేను నాలుగంటే నాలుగే అబద్ధాలాడి నిన్ను పెళ్లి చేసుకుని 96 అబద్ధాలు

నష్టపోయాను. మరి దాని మాటేమిటి ?" అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు

కృష్ణ.