Manchi English Cinema

మంచి ఇంగ్లీష్ సినిమా

ఆదివారం.ఆఫీసుకు సెలవు.

భార్యను తీసుకుని సరదాగా పార్కుకు వెళ్లాలనుకున్నాడు సుందరం.

ఆ విషయాన్ని ప్రేమగా తన భార్యతో చెప్పాడు.

“కాంతం..." అని అతి ప్రేమగా పిలిచాడు సుందరం.

" ఏంటి ?" అని కొంచం గడుసుగా అన్నది కాంతం.

" అలా సరదాగా పార్క్ కి వెళ్దాం వస్తావా?” అని ఆశగా చూస్తూ అన్నాడు సుందరం.

“ఇప్పుడా పార్కులు గట్రా తిరగలేను కానీ, ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమాకి

తీసుకెళ్ళరాదూ?!” అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది కాంతం.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం.