Pratiroju Chese Pane Kada

Pratiroju Chese Pane Kada

ప్రతిరోజూ చేసే పనే కదా

ప్రముఖ టీవీ కంపెనీ వాళ్ళు ఒక క్విజ్ పోటీ నిర్వహించారు. అందులో గెలుపొందిన

వాళ్ళని విదేశాలకు పంపడానికి నిర్ణయించారు.

ఆ పోటీలో మొత్తం నాలుగు జంటలు గెలుపొందాయి. ఆ నాలుగు జంటల్లో మూడు

జంటలు ఆంధ్ర జంటలు. ఒక జంట తమిళ్ జంట.

ఆ నాలుగు జంటలు విదేశాలకు వెళ్ళాయి. ఒక రోజు సాయంత్రం నలుగురు భర్తలు

బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

" ఈ రోజు మన నలుగురం కలిసి ఒక వెరైటీ చేసి మన భార్యలను గొప్ప థ్రిల్ చేద్దాం "

అని సంబరంగా అన్నాడు తమిళ్ వాడు.

" మంచి గుమగుమలాడే వంటచేసి మన భార్యలకు తినిపిద్దాం " అని ఆ ముగ్గురిలో

ఒకడు అన్నాడు.

" ఓస్...వెరైటీ అంటే ఏమిటో అనుకున్నాను...ఇది నేను రోజూ ఇంటి దగ్గర చేసేదేగా..."

అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఒకడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోర్లు తెరిచారు ముగ్గురు.