చీమని చంపడం ఎలా?

చీమని చంపడం ఎలా?

 

ఒక టీచరుగారికి తన విద్యార్థులు ఎంత తెలివిగా ఆలోచిస్తారో పరీక్షించాలని అనిపించింది. అందుకోసం ఒక పరీక్షలో ఈ కింది ప్రశ్నని ఇచ్చారు.
 

చీమని చంపడం ఎలా? (25 మార్కులు)
 

ఈ ప్రశ్నకి ఓ విద్యార్థి ఇలా సమాధానం రాశాడు.
 

‘ముందుగా చీమ ఉండే పుట్ట బయట కాస్త కారం కలిపిన పంచదారని ఉంచాలి. చీమ ఆ పంచదారను తినగానే దాహం వేస్తుంది. అప్పుడు అది తన దాహాన్ని తీర్చుకోవడం కోసం పక్కనే ఉండే చెరువు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు దాన్ని ఆ చెరువులోకి తోసేయాలి. చెరువులో పడిపోయిన చీమకి చలివేస్తుంది. ఆ చలిని కాచుకునేందుకు, చీమ చలిమంట వేసుకుంటుంది. అప్పుడు ఈ మంటలో ఒక బాంబుని పెట్టాలి. ఆ బాంబు పేలి చీమ తీవ్రంగా గాయపడుతుంది. అప్పుడు ఆ చీమని ఒక ఆసుపత్రిలో చేర్చాలి. అలా చీమ ICUలో చికిత్స తీసుకుంటుండగా, దానికి ఉన్న ఆక్సిజన్‌ మాస్క్‌ తీసేయాలి. అప్పుడు ఆ చీమ చచ్చిపోతుంది.’
 

ఈ జవాబు చదివిన తరువాత విద్యార్థుల తెలివితేటలను అనవసరంగా పరీక్షించకూడదని అర్థమైంది గురువుగారికి.