Friendship Day Jokes

 

ఎలుగుబంటి కోసం!


ఇద్ద‌రు స్నేహితులు అడ‌విలో వెళ్తున్నారు. ఇంత‌లో వారివైపు ఒక ఎలుగుబంటి రావ‌డం క‌నిపించింది. వెంట‌నే వాళ్ల‌లో ఒక‌డు ర‌న్నింగ్ షూస్ తీసి వేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు.

`నువ్వెంత రన్నింగ్ షూస్ వేసుకుని ప‌రిగెత్తినా ఉప‌యోగం లేదు. ఆ ఎలుగుబంటి నిన్ను ప‌ట్టేసుకుంటుంది.` అన్నాడు మొద‌టి స్నేహితుడు.

`నేను ర‌న్నింగ్ షూస్ వేసుకునేది నీకంటే వేగంగా ప‌రిగెత్త‌డం కోసం,` అంటూ ప‌రుగు లంకించుకున్నాడు రెండో స్నేహితుడు.

స్నేహితుడు ఏ కార్డు

జీవితంలో- టీచ‌ర్ ప్రోగ్రెస్ కార్డులాంటివాడు, భార్య రేష‌న్ కార్డులాంటిది, ల‌వ‌ర్ ఏటీఎం కార్డులాంటివాడు, పొరుగింటివారు గ్రీటింగ్ కార్డులాంటివారు, బంధువులు ఇన్విటేష‌న్ కార్డులాంటివారు. కానీ స్నేహితుడు ఆధార్‌కార్డులాంటివాడు. అత‌ను లేక‌పోతే ఏ ప‌నీ జ‌ర‌గ‌దు.

 

పైకి చూస్తే

జాన్‌, జాక్ అనే ఇద్ద‌రు స్నేహితులు అడ‌విలోకి వెళ్లారు. ప‌గ‌లంతా వేటాడి రాత్రికి అక్క‌డే గుడారం వేసుకుని ప‌డుకున్నారు. తెల్ల‌వారుజాము మూడు గంట‌ల‌కి జాన్‌కి మెల‌కువ వ‌చ్చింది. వెంట‌నే అత‌ను త‌న స్నేహితుడు జాక్‌ని నిద్ర‌లేపాడు.
`జాక్ పైన చూడు. నీకు ఏం క‌నిపిస్తోంది?` అని అడిగాడు.
`ఓహ్‌! ఈ అంద‌మైన ఆకాశం ఎంత బాగుందో! కోట్ల కొద్దీ న‌క్ష‌త్రాలు, దూరంగా చంద‌మామ‌, అక్క‌డ‌క్క‌డా మ‌బ్బులు, ప‌చ్చ‌ని చెట్లు, మేఘాల‌ను తాకుతున్న కొండ‌లు... అన్నీ క‌నిపిస్తున్నాయి. మ‌రి నీకేమ‌నిపిస్తోంది!` అని అడిగాడు జాక్‌.
`నీ బొంద‌. మ‌న గుడారం ఎవ‌రో ఎత్తుకెళ్లిపోయార‌ని అనిపిస్తోంది,` చిరాగ్గా బ‌దులిచ్చాడు జాన్.