బుద్ధిమంతుడు

 

బుద్ధిమంతుడు

‘మా అబ్బాయంత బుద్ధిమంతుడు ఈ ప్రపంచంలోనే లేడు. కూర్చోమంటే కూర్చుంటాడు. నిల్చోమంటే నిల్చుంటాడు,’ తన కొడుకు గురించి ఆఫీసులో చెప్పసాగాడు రవి.

కొలీగ్‌: అంత బుద్ధిమంతుడా. సిగిరెట్టు కూడా తాగడా!

రవి: అబ్బే సిగిరెట్‌ వాసనే వాడికి పడదు. నేను సిగిరెట్‌ తాగుతున్నా కోపంగా చూస్తాడు.

కొలీగ్: అరే! పోనీ నీకు తెలియకుండా మందు కొడతాడేమో!

రవి: మందా పాడా! అసలు ఆ వాసన వస్తేనే వాడికి వాంతి వస్తుంది.

కొలీగ్: గ్రేట్‌! మరి పార్టీలూ గట్రా... ఇంటికి ఆలస్యంగా రావడాలూ...

రవి: ఛఛా! సాయంత్రం ఐదయితే చాలు వాడు ఇంట్లో ఉండాల్సిందే.

కొలీగ్: నీ కొడుకు బుద్ధిమంతుడు అని ఒప్పుకుని తీరాల్సిందే.

రవి: అవును. వాళ్ల టీచర్లు కూడా అదే చెబుతూ ఉంటారు. ఎల్‌కేజీ పిల్లలందిలోకీ వాడే బుద్ధిమంతుడని!!!