షాక్ ట్రీట్‌మెంట్

 

షాక్ ట్రీట్‌మెంట్

సుబ్బారావు డాక్టరు దగ్గరకెళ్లాడు. సుబ్బారావు: అయ్యా డాక్టరుగారూ, నిన్నటినుండి ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయి, ఏం చెయ్యాలండీ?

డాక్టరు ఏం మాట్లాడకుండా వచ్చి సుబ్బారావుకు చాచి చెంపమీద ఒకటిచ్చాడు. సుబ్బారావుకు కళ్లు తిరిగాయి, కొద్ది సేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.

ఆ తరువాత డాక్టరు నవ్వుతూ అన్నాడు: చూశారా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి? ఏదైనా షాక్ ఇస్తే ఎక్కిళ్లు ఆగిపోతాయని శాస్త్రం చెబుతుంది.

సుబ్బారావు ఏడుస్తూ అన్నాడు: సార్! ఎక్కిళ్ళు నాకు కాదండీ, మా ఆవిడకు.