తెలుగు వారంతా గర్వపడే అద్భుత చిత్ర రాజం పూర్ణోదయావారి "శంకరాభరణం"చిత్రం.ఈ చిత్రంలో శంకర శాస్త్రి గా నటించిన జె.వి.సోమయాజులు గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఈ చిత్రంలో పాత్ర ద్వారా వచ్చాయో అందరికీ తెలిసిందే.కానీ మనకి తెలియని విషయం ఒకటుంది.ఈ శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించారు.కానీ కొన్ని కారణాలవల్ల ఆయన ఈ చిత్రంలో నటించలేదు.తర్వాత ఈ పాత్ర కోసం నడిగర తిలకం శివాజీ గణేషణ్ ని సంప్రదించారు.ఆయన కూడా ఈ పాత్రలో నటించటానికి ఇష్టపడలేదు.ఆ తర్వాత రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారిని ఆ పాత్రకోసం అడిగారు.ఆయన కూడా కాదన్న తర్వాతే ఈ పాత్ర సోమయాజులు గారికి దక్కింది.మంజు భార్గవి నటించిన పాత్ర కోసం ముందు జయప్రద గారిని అడిగారు.కానీ డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్ల ఆమె ఆ పాత్రలో నటించలేకపోయారు.అది మంజు భార్గవికి దక్కింది.ఈ చిత్రం విడుదలయ్యాక వారం వరకూ అస్సలు ప్రేక్షకాదరణ లేదు.కానీ యన్ టి ఆర్,ఎ యన్ ఆర్,శివాజీ గణేషణ్ వంటి సినీ పెద్దలంతా ఆ చిత్రం గొప్పదనం గురించి చెప్పాక నెమ్మదిగా ఈ చిత్రం పుంజుకుంది.ఆ తర్వాత ప్రపంచప్రఖ్యాతి గాంచిన తెలుగు చిత్రంగా పేరు గడించింది.అందుకే పెద్దలు ఏదైనా మనకు దక్కాలంటే అదృష్టముండాలంటారు.