మల్లెపూవు,పట్నంవచ్చిన పతివ్రతలు,ప్రేమాభిషేకం వంటి 960 చిత్రాలకు సంగీతం అందించి,600 చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అసలు పేరు మీకు తెలుసా...?డ్రైవర్ రాముడు, వేటగాడు, యమగోల,ఏడంతస్తుల మేడ, వంటి అనేక చిత్రాలకు ఆయన సంగిత దర్శకత్వం వహించారు.వయసు పిలిచింది,అంతులేని కథ వంటి అనేక చిత్రాల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పింది చక్రవర్తి గారే.అలాంటి చక్రవర్తి గారి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.ఆయనది గుంటూరు.ఆయన పోయినా ఆయన సంగీతం అందించిన చిత్రాలు మాత్రం ఈనాటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయన్నది మాత్రం నిజం.