సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన "రోబో"ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్టయ్యింది.కానీ ఇవేవీ పట్టని రజనీ కాంత్ మాత్రం తన మానాన తాను తీరిగ్గా హిమాలయ పర్వతాలకు వెళ్ళారు.మామూలుగా తన ప్రతి సినిమా విడుదలకు ముందు అలా హిమాలయ పర్వతాలకు వెళ్ళటం మామూలే.కానీ ఈసారి అక్కణ్ణించీ మానస సరోవరానికి వెళతారట రజనీ కాంత్.ఎప్పుడూ ఓ పదిరోజుల పాటు హిమాలయాల టూర్ వేసే రజనీ కాంత్ ఈసారి మాత్రం ఒక నెల రోజుల పాటు హిమాలయ పర్వత సాణువుల్లో సేదతీరనున్నారు.నిజానికి రజనీ కాంత్ కి ఐహిక సుఖాల మీద ఏ మాత్రం మోజు లేదనటానికి ఇక్కడ పెట్టిన ఫొటోనే తార్కాణం.ఆయన కర్మ యోగి.తామరాకు మీద నీటి బొట్టులా ఈ లోకంలో బ్రతుకుతున్నారు రజనీ కాంత్.