గతంలో హాలీవుడ్‌లో వచ్చిన "సల్యులర్" అనే చిత్రాన్ని కాపీ కొట్టటానికి ఈ చిత్ర దర్శకుడు ప్రయత్నం చేశాడు. ఆర్తి అగర్వాల్ ఒక యాడ్ ఏజన్సీకి అధిపతి. అమెనెవరో కిడ్నాప్ చేసి ఒక చోట బంధిస్తారు. ఆ గదిలో ఉన్న టెలిఫోన్ కూడా సుత్తితో పగలగొడతారు. కానీ ఆమె అక్కడున్న టెలిఫోన్ వైర్లన్నీ కలిపి చేతికొచ్చిన నంబర్‌కి ఫోన్‌చేసి తన పరిస్థితి చెప్పి కాపాడమంటుంది. ఆ ఫోన్ నంబర్ వేణుది. దాంతో అతనామెను కాపాడటానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఇంతకీ ఆర్తి అగర్వాల్‌ని కిడ్నాప్ చేసింది పోలీసులే. ఆమె నుంచి ఒక వీడియో కేసెట్ పోందటానికి వారామెను కిడ్నాప్ చేస్తారు. ఆ వీడియో కేసెట్‌లో ఏముంది...? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడకుండా వుండటమే బెటర్...
Analysis
ఇది హాలీవుడ్ సినిమాకి కాపీ అని ముందే చెప్పుకున్నాం. హాలవుడ్ చిత్రంలో ఉండే టెంపో, ఆ టెక్నాలజీ ఆ స్థాయి వేరు. దాంట్లో ఉన్న కంటెంట్‌ని తీసుకుని మన నేటివిటీకి అనుగుణంగా మార్చి ఈ సినిమా తీయటానికి దర్శకుడు బాగానే ప్రయత్నించాడు. కానీ బలంగా విఫలమయ్యాడు. ఇందులో ఏ పాత్రకీ సరైన క్యారెక్టరైజేషన్ కుదరలేదు. కామెడీ హీరోగా పేరుపడ్డ వేణు ఈ సినిమాలో సీరిస్‌గా ఉండాల్సి వచ్చింది. గతంలో ఆర్తి అగర్వాల్ వైభవం చూసిన ఎవరికైనా ఈ చిత్రంలో ఆమె పాత్రను చూస్తే జాలేయక మానదు. ఇక బానుచందర్, వినోద్‌కుమార్‌ల పాత్రలు జోకర్‌లకన్నా హీనంగా తయారయ్యాయి. సుబ్బరాజు పాజిటీవ్ పాత్రలో ఫరవాలేదనిపిస్తాడు. బ్రహ్మానందం, ఆలీ, కొండవలసల కామెడీ వెగటుగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బిలో యావరేజ్ ఉంది. ఇక ఈ చిత్రం ఎడిటింగ్ గురించి చెప్పకుండా ఉంటేనే మేలు. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో అర్థం కాదు. ఫైనల్‌గా సంగీతం గురించి ఓ మాట. వందేమాతరం సంగీతం పరమ భయంకరంగా ఉంది. నిజానికి అతని పేరు మీద ఇంకెవరన్నా సంగీతం అందించారేమో అర్థం కాదు. నేపథ్య సంగీతం శబ్దహోరులా ఉంటుంది.
TeluguOne Perspective
వేణు సినిమాల్లో ఇది ఘోరమైన ఫ్లాప్‌గా నిలుస్తుంది. చూడక్కరలేదు.