visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
More Interviews >> 
తెలుగువన్ కి  శృతిహాసన్  (Jan 07 2011)
సకలకళావల్లభుడు,పలుమార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎన్నికై,లోకనాయకుడిగా ప్రసిద్ధిచెందిన అద్భుతనటుడు పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ గారాల పట్టి అయిన శృతిహాసన్ కూడా తండ్రికి తగ్గ తనయ.శృతి హాసన్ హీరోయిన్ గా తన తొలి చిత్రాన్ని బాలీవుడ్ లో"లక్"చిత్రంతో ప్రారంభించింది.తన ద్వితీయ చిత్రాన్ని మాత్రం తెలుగులో సిద్ధార్థ హీరోగా,కోవెలమూడి సూర్యప్రకాష్ దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు,ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సంయుక్తంగా నిర్మిస్తున్న"అనగనగా ఓ ధీరుడు"అనే ఫాంటసి చిత్రంలో నటిస్తూంది శృతి హాసన్.శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు.ఆమె మ్యూజిక్ కంపోజర్ కూడా.కమల్ హాసన్,వెంకటేష్ కలసి నటించిన"ఈనాడు"చిత్రానికి శృతి హాసన్ రీ-రికార్డింగ్ అందించింది.అటువంటి శృతి హాసన్ తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ఇచ్చిన 'ప్రత్యేక ఇంటర్వ్యూ'...

తెలుగువన్ - నమస్కారం శృతి హాసన్.బాగున్నారా...?
శృతి హాసన్ - ఐ యామ్ ఫైన్ సార్...హౌ ఆర్ యూ...?
తెలుగువన్ -  బాగున్నాం.మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాం.
శృతి హాసన్ -  ష్యూర్..తప్పకుండా.అడగండి.
తెలుగువన్ -  మీకీ సినిమాలో నటించే అవకాశం ఎలా లభించింది...?
శృతి హాసన్ - ఈ చిత్ర దర్శకులు కోవెలమూడి సూర్య ప్రకాష్ గారు చెన్నైకి వచ్చి నాకి చిత్ర కథను వినిపించారు.నాకీ కథ కొత్తగా     అనిపించింది.అందుకని విన్న వెంటనే అంగీకరించాను.
తెలుగువన్ - అప్పడు వాల్ట్ డిస్నీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని మీకు తెలుసా...?
శృతి హాసన్ -  లేదండీ...అప్పటికి వాల్ట్ డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందన్న విషయం ప్రస్తావనే లేదు.సినిమా షూటింగ్         జరుగుతూండగా,మధ్యలో వాళ్ళొచ్చారు.అంతే.
తెలుగువన్ - ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో కానీ,ప్రేక్షకుల్లో కానీ మీ నాన్నగారు కమల్ హాసన్ కి చాలా గొప్ప పేరుంది.ఆయన          కుమార్తెగా మీరు తొలిసారి ఒక తెలుగు సినిమాలో నటిస్తుందకు ఎలా భావిస్తున్నారు.
శృతి హాసన్ -  వండ్రఫుల్ ఫీలింగండీ.తమిళనాడులో కన్నా నాన్నగారికి ఇక్కడే ఇంకా ఎక్కువ పేరుందేమోననిపిస్తుంది.నన్ను తమ సొంత అమ్మాయిలా గౌరవిస్తున్నారు,అభిమానిస్తున్నారు.ఇట్స్ రియల్లీ గ్రేట్.
తెలుగువన్ - మీ కోస్టార్ సిద్ధార్థతో నటించటం మీకేలా అనిపించింది....?
శృతి హాసన్ -  హీ ఈజె వండ్రఫుల్ కోస్టార్ టు వర్క్ విత్.హీ ఈజ్ వేరీ కో-ఆపరేటీవ్.అతన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
తెలుగువన్ - అతనేమో మీ నాన్నగారి నుంచి చాలా నేర్చుకున్నానంటున్నాడు.అంటే ఒక విధంగా మీ నాన్నగారి నుంచే మీరు     నేర్చుకుంటున్నట్లు.
శృతి హాసన్ -  ఒక విధంగా అంతేననుకోండి.


తెలుగువన్ - మీ డైరెక్టర్ గురించి చెప్పండి.
శృతి హాసన్ -  అతనికేం కావాలో క్లారిటీ ఉన్న డైరెక్టర్ మిస్టర్ సూర్యప్రకాష్.ఆయనేం తీస్తున్నాడో,దాన్ని ఎలా తీయాలో బాగా క్షుణ్ణంగా  తెలిసిన వ్యక్తి మిస్టర్ సూర్య ప్రకాష్
తెలుగువన్ - ఈ చిత్రంలో సంగీతం గురించి చెప్పండి...
శృతి హాసన్ - నిజానికి ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని అందించారు.ఒక్కొ పాట ఆ యా సీన్ మూడ్ ని ఎలివేట్‍ చేసేలా ఉంటుంది.అన్ని పాటలూ దేనికదే విభిన్నంగా ఉంటాయి.ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
తెలుగువన్ - మీకు తెలుగులో ఆఫర్లేమన్నావస్తున్నాయా...?
శృతి హాసన్ -  వస్తున్నాయి.కానీ అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయి.వాటిలో ఒకటో రెండో ఫైనలైజవ్వొచ్చు.
తెలుగువన్ - మీకు సంగీతం కుడా తెలుసు కదా...మరి దాన్నేం చేస్తారు...?   
శృతి హాసన్ -  అవకాశం ఉన్నప్పుడు నా సంగీతం గురించి ఆలోచిస్తూనే ఉంటాను.ప్రస్తుతం మాత్రం నటన మీదే నా ఏకాగ్రత అంతా.
తెలుగువన్ - ఒ.కె.శృతి ఆల్ ది బెస్ట్ టు యూ...తెలుగువన్ విషస్ యువర్ మూవీ షుడ్ బి ఎ గ్రేట్ సక్సస్.
శృతి హాసన్ -  థేంక్యూ.ఐ విష్ ఆల్ తెలుగు వన్ వ్యూవర్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఎ హ్యాపీ పొంగల్.బై బై...

....TeluguOne-Cinema-Editorial
TeluguOne - CMS - Comments
   
Online-Shopping- teluguone.com
Send Home Appliances gifts