visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
More Interviews >> 
"కలలాంటి నిజం సినిమా"-భూమిక (Aug 28 2010)
ఒక నటిగా,హీరోయిన్ గా తెలుగు సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు నటి భూమిక చావ్లా."ఖుషి" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ సరసన హీరోయిన్ గా "నువ్వు దమ్ముకొట్టు,మందుకొట్టు"అంటూ నటించిన భూమిక నటన ప్రేక్షకులు మరచిపోగలరా...? సింహాద్రి, సాంబ సినిమాల్లో యంగ్ టైగర్ యన్ టి ఆర్ సరసన ఆమె నటించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన భూమిక నటించిన స్టైల్ జనం ఎన్నటికీ మరచిపోరు.ఇక మిస్సమ్మ చిత్రంలో ఆమె నటన అద్భుతంగా ఉంటే,అనసూయ చిత్రంలో ఆమె నటన ఆత్మస్థయిర్యం కలిగిన ఓ ఆడపిల్లలా అందర్నీ మెప్పిస్తుంది.అలాంటి గ్లామరస్ యువ కథానాయిక భూమిక యోగా మాస్టర్,యోగా గురు భరత్ ఠాకూర్ తో ప్రేమలో పడింది.వారి ప్రేమ పరిణితి చెందింది కనుక అది పెళ్ళికి దారితీసింది.వారి కాపురం ముడుపువ్వులూ ఆరుకాయలుగా విరాజిల్లుతూంది.ఇదిలా
ఉంటే ఉన్నట్టుండి భూమికకు సినిమా తీయాలనిపించింది.దాంతో "డౌన్ టౌన్"అనే నిర్మాణపు సంస్థను స్థాపించి,తొలి ప్రయత్నంగా నవదీప్ హీరోగా "యాగం"అనే చిత్రాన్ని నిర్మించారు భూమిక దంపతులు.శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక "సత్యభామ" అనే చిత్రంలో నటించారు.అప్పుడు అతను చెప్పిన కథ భూమికకు బాగా నచ్చి ఆ కథతో సినిమా తీయాలనుకున్నారు.దాని ఫలితమే 15 మంది నూతన తారలతో భరత్ ఠాకూర్, భూమిక నిర్మించిన"తకిట తకిట".ఈ చిత్రం గురించి భూమిక దంపతుల మనోభావాలు మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకం...
తెలుగువన్- నమస్తే సార్ భరత్ గారూ,నమస్తే భూమిక గారూ.
భూమిక -  నమస్తే సార్ రండి...వెల్‍ కమ్..
తెలుగువన్-మీ సినిమా "తకిట తకిట" గురించి చెప్పండి
భూమిక - ఓ ష్యూర్.నేను "సత్యభామ" సినిమా చేస్తున్నప్పుడే శ్రీహరి నాను ఈ కథ నాకు చెప్పటం జరిగింది.ఒక నటిగా ఒక ప్రేక్షకురాలిగా నేను ఎలాంటి సినిమాలో నటించాలనుకుంటానో అది అలాంటి కథ.ఆ తర్వాత అనుకోకుండా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయటం ఇప్పుడు అదే కథను సినిమాగా తీయటం జరిగింది.ఇది కథను నమ్మి తీసిన సినిమా.
తెలుగువన్-అది సరే మీరు తీసిన సినిమా సెప్టెంబర్ మూడవ తేదీన విడుదల కాబోతుంది.దీని మీద మీ ఫిలింగ్స్ ఏంటి...?
భూమిక -  నిజంగా చెపుతున్నాను.చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్ కోసం ఎలా టెన్షన్ గా ఎదురు చూసేదాన్నో ప్రస్తుతం నా పరిస్థతి అలా ఉంది.
తెలుగువన్- ఈ చిత్రం అందరూ కొత్త వాళ్ళతో తీసినట్టున్నారు...?
భూమిక -  అవునండీ.మొత్తం పదిహేనుమంది కొత్తవాళ్ళని చిత్రంలో పరిచయం చేస్తున్నాం.
తెలుగువన్- ఈ సినిమా ప్రత్యేకతలేంటో చెప్పండి!
భూమిక -  ఈ సినిమాలో నేను ఒక టీచర్ గా నటిస్తున్నాను.పాత్ర చిన్నదే అయినా చాలా ప్రాథాన్యత ఉన్న పాత్ర.అలాగే నాగార్జునగారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.అనుష్క కూడా ఈ చిత్రంలో ప్రేక్షకులనలరించనుంది.
తెలుగువన్- నాగార్జునగారి పాత్ర గురించి చెప్పండి.
భూమిక - ఆయనతోనే ఈ సినిమా మొదలవుతుంది.ఆయనతోనే ఈ సినిమా ముగుస్తుంది.ఈ చిత్రంలోని ప్రతి పాత్రకూ ఆయన పాత్రతో
లింకుంటుంది.ఆయన పాత్రేంటని అడక్కండి.అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.అదే ఈ చిత్రానికి హైలైట్.
తెలుగువన్- ఈ చిత్రంలోని మిగిలిన ప్రత్యేకతల గురించి...అంటే సంగీతం, కెమెరా వర్క్ గురించీ...అసలు సినిమా ఏలా ఉండబోతూంది...?అన్న వాటి గురించి చెప్పండి.
భూమిక -  ఈ చిత్రానికి బోబో శశి సంగీతాన్నందించారు.ఇటీవలే విడుదలైన మా చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుంచి అనుహ్య స్పందన లభించింది.ఈ చిత్ర సంగీతాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.అలాగే "యమదొంగ","మగధీర"వంటి చిత్రాలకు పనిచేసిన సెంథిల్‍ కుమార్ ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.ఆయన గురించి ఆయన కేమెరా వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.ఇక సినిమాలకు కథలూ,మాటలూ వ్రాయటంలో ఎంతో అనుభవజ్ఞులైన కోన వెంకట్ మా చిత్రానికి మాటలు వ్రాశారు.దాన్ని బట్టి మా చిత్రంలో మాటలెలా ఉండబోతున్నాయో మీరూహించవచ్చు.ఈ సినిమా ఫస్ట్ హాఫంతా వినోదాత్మకంగా అంటే కామెడీగా సాగుతుంది.ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి హృదయాలను ద్రవింప జేసేలా ఉంటుందీ చిత్రం.
తెలుగువన్- ఒక సినిమాలో నటించటం తేలికా...? లేక ఒక చిత్రం తీయటం తేలికనుకుంటున్నారా...?
భూమిక -  సినిమా అంటే కలలాంటి నిజం.ఒక కలను నిజంలా చెప్పటమే సినిమా.ఒక సినిమా నిర్మించటం కన్నా ఖచ్చితంగా ఒక సినిమాలో నటించటం తేలిక.నటించటం వరకే మన బాధ్యత.కానీ సినిమా తీయాలంటే ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులుంటాయి.అనేక టెన్షన్స్ ఉంటాయి.తీరా సినిమా తీశాక దాన్ని ప్రమోట్ చేసుకోవాలి.ఇదంతా నేను చెప్పినంత తేలిక కాదు.
తెలుగువన్- మీ సినిమా "తకిట తకిట"మంచి హిట్టవ్వాలని ఆశిస్తూ శలవు.నమస్కారం.
భూమిక - మాకు మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ నమస్కారం.
   
 

....TeluguOne-Cinema-Editorial
TeluguOne - CMS - Comments
   
Online-Shopping- teluguone.com
Send Home Appliances gifts