తెలుగు వన్ - హాయ్ శ్రియ హౌ ఆర్ యూ...? శ్రియ - ఫైన్.మీరెలా ఉన్నారు...? తెలుగు వన్ - మీరు చాలాకాలం తర్వాత తెలుగులో మళ్ళీ నటించారు.ఇంత గ్యాప్ రావటానికి కారణం...? శ్రియ - ప్రత్యేకమైన కారణాలేమీ లేవు.అయినా నేను తెలుగు ప్రేక్షకులకు నా డబ్బింగ్ సినిమాల ద్వారా ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాను కదా...? తెలుగు వన్ - మీరు నటించిన "డాన్ శీను" ఘనవిజయం సాధించింది.ఎలా ఫీలవుతున్నారు...? శ్రియ - చాలా హ్యాపీగా..? తెలుగు వన్ - ఈ సినిమా విజయానికి ముఖ్య కారణమేంటి...? శ్రియ - ఒకటి కాదండీ...ఒకరు కాదండీ.ముందు హీరో రవితేజ గారు,దర్శకుడు గోపీచంద్,నిర్మాత వెంకట్ గారూ,ఆలీ, బ్రహ్మానందం గారు,అలాగే ఈ చిత్రంలో మొదటి నుంచీ చివరి వరకూ పుర్తిస్థాయి వినోదముంది.ప్రేక్షకులు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు వన్ - మీరీ సినిమా చుశారా...? శ్రియ - ఆ...అయితే ఇక్కడ కాదు చెన్నైలో మా మదర్ తో కలసి థియేటర్ కి వెళ్ళి చూశాను.నేను సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను.నేను కామేడీ సీన్లొస్తే పెద్దగా నవ్వుతాను.అది కంట్రోల్ చేసుకోవటం నావల్ల కాదు.అప్పుడు జనమంతా నన్నే చూశారు. తెలుగు వన్- ఈ సినిమాలో మీతో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది కదా.ఆమె గురించి చెప్పండి.. శ్రియ - ఆమె చాలా మంచి అమ్మాయి.మా మధ్య ఎలాంటి ఇగో ప్రోబ్లెమ్స్ లేవు.ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటూంటాం. తెలుగు వన్ -మీ హీరో గురించి ...? శ్రియ - హీ ఈజ్ అమేజింగ్ పర్సన్.ఆయన చాలా మంచి హ్యుమరిస్ట్,అలాగే చాలా మంచి హ్యూమన్ కూడా.ఆయన ఈ సినిమాకే పెద్ద ఎస్సెట్.ఈ సినిమాలో మీరు ఆయన నటన చూస్తే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. తెలుగు వన్ - ఆలీ, బ్రహ్మానందంల గురించి చెప్పండి. శ్రియ - ఈ సినిమా ఫస్టాఫ్ అంతా రవితేజ,ఆలీ నవ్విస్తే సెకండ్ హాఫ్ అంతా రవితేజ,బ్రహ్మానందం గారు నవ్విస్తారు.మొత్తానికి సినిమా అంతా నవ్వులే నవ్వులు. తెలుగు వన్- మీ దర్శకుడు గోపీచంద్ గురించి చెప్పండి...! శ్రియ - అతనికిది తొలి చిత్రం.అయినా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని అతను మలచిన తీరు అద్భుతం.నిజానికి హీరో రవితేజ తర్వాత ఈ చిత్ర విజయానికి మూలకారకుడు గోపీనే అని చెప్పాలి. తెలుగు వన్ - ఈ సినిమాలో మీరు చాలా గ్లామరస్ గా కనిపించటానికి కారణం...? శ్రియ - యోగా,మేడిటేషన్,లిమిటెడ్ ఫుడ్,హ్యాపీగా ఉంటే అది మీ ముఖంలో కనిపిస్తుంది.అంతే కాకుండా నన్ను కేమెరామేన్ సమీర్ బాగా అందంగా చూపించారు. తెలుగు వన్ - మీరు తెలుగులో మళ్ళీ బిజీ అవుతారా...? శ్రియ - అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా చేస్తాను."శివాజీ" చిత్రం తర్వాత తమిళంలో బాగా అవకాశాలు రావటంతో తేలుగులో కోంత గ్యాప్ వచ్చిన మాట నిజమే.ఈ సారి అలాకాకుండా జాగ్రత్త పడతాను. తెలుగు వన్ - ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలేమిటి...? శ్రియ - తమిళంలో ఆర్య హీరోగా నటిస్తున్న "చికుబుకు" చిత్రంలోనూ,జీవా హీరోగా నటిస్తున్న "రౌదిరం"అనే మరో చిత్రంలోనూ,దీపా మెహతా దర్శకత్వంలో ఒక ఇంగ్లీష్ చిత్రంలోనూ నటిస్తున్నాను. తెలుగు వన్ - ఆల్ ది బెస్ట్ శ్రియా.బై...సీయూ శ్రియ - బై..బై..!