visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
More Interviews >> 
ప్రియ భావాల భావన (Nov 26 2008)
పుట్టింది సినిమా కుటుంబంలోనే అయినా వెండి తెరమీదకు వస్తానని ఏనాడూ అనుకోలేదు అంటోందీ బుజ్జి బుజ్జిగా బుంగమూతి పెట్టి తెలుగు కుర్రకారు ఎదపై సంతకం చేసిన కేరళ కుట్టి భావన. తెలుగు పరిశ్రమ, తన పాత్రల తీరుతెన్నూ... కాబోయే వరుడు... ఒకటేమిటి పసందైన ప్రశ్రలకు "తెలుగువన్‌"కు సమాధానమిచ్చిందీ భావన.
కథను ఎన్నుకునేటప్పుడు మీరిచ్చే ప్రాధామ్యాలేమిటి...?
హీరో, బ్యానర్‌, దర్శకుడు... ఈ మూడు విషయాల్లో కటి ప్రాచుర్యం పొంది ఉండాలి. అలా కాకుండా ఏదో చేసేద్దామని అందరూ కొత్తవాళ్ళని ఎంచుకుని వాళ్లతో చేసి.. ఇంతవరకు నాకున్న ఇమేజ్‌ చెడీ.. ప్రాక్టికల్‌గా ఆలోచించే తత్వం నాది. అందుకే నిస్సంకోంగా ఈ విషయాలను చెప్పేస్తున్నాను.
యువ హీరోలతో మాత్రమే నటిస్తానని అంటున్నారట కదా...?
అంటే.. నేను ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమలోకి వచ్చాను. వచ్చిరాగానే పెద్ద హీరోలతో పనిచేసేస్తే యువ హీరోల పక్కన నటించడానికి ఆలోచించాల్సి వస్తుంది. అదే ముందు మంచి ప్రేమ కథలను చేసేశామనుకోండి. తర్వాత అంచలంచెలుగా ఎదగడానికి వీలుంటుంది.
తోటి హీరోలను రారా, పోరా అని పిలిచే హీరోయిన్‌ మీరేనట కదా..?
నా హీరోలందరూ అటూఇటూగా నా ఏజ్‌ వాళ్లే. కలిసి పని చేసేవాల్ళం. ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ముంది. సాధారణంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు తనతో చదివేవారిని చూసి అలా పిలవరా? మరి నేను పిలిస్తే తప్పేముంది? అంతెందుకు ఇప్పుడు నితిన్‌తోనూ అంతే స్నేహంగా వుంటాను. అందరూ ప్రేమ అని అంటున్నారు. నా మనస్సుకు తెలియని ప్రేమ ఇంతమందికితెలిసిందా అనిపించింది.
అంటే నితిన్‌తో ప్రేమ నిజం కదా..?
మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఎవరో ఎక్కడో రాస్తే చదివొచ్చి తనే నాకు చెప్పాడు. కేరళ, చెన్నైల నుంచి కొంతమంది ఫోన్‌ చేసి "ఎవరు ఆ హీరో... బాగుంటాడా?" అని అడిగారు. అది ఇక్కడ కొత్తగా పుట్టిన పుకారని చెప్పి వివరించాను.
ఇలాంటి విషయాల గురించి మీ తల్లితండ్రుల దృష్టికి వచ్చినప్పుడు ఎలా ఫీలవుతారు...?
వాళ్లకి కొత్తకాదు. నేను చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో వాళ్లకి ఎప్పుడో చెప్పాను. అయినా ప్రేమ చెప్పి పుట్టదంటారు కదా?.. నా పెళ్లి ఫిక్సయ్యేవరకు నేను ఫలానా విధంగానే పెళ్లి చేసుకుంటానని అవాకులు పేల్చేయను.
భర్తలో వెతుక్కునే క్యాలిటీలు చెబుతారా...?
మరీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు. నన్ను అర్థం చేసుకోవాలి. హాస్యచతురత ఉండాలి. ఎత్తుగా ఉండాలి. బాగా డబ్బుండాలి. మంచివాడై ఉండాలి.. మా నాన్నతో ఓసారి ఇలాగే చెప్పుకుంటూ పోయాను. ఆయనేమన్నారో తెలుసా..? "బ్రహ్మకు చెప్పి ఆర్డరిద్దాం లేమ్మా" అని. మరి మన  ఇన్ని కోరికలూ పూర్తవ్యవాలంటే అలాంటి అబ్బాయి దొరకాలి కదా.
కథ ముఖ్యం... గ్లామర్‌ కాదు అన్న మీరు అవసరమైతే గ్లామర్‌గా నటిస్తానని అంటున్నారట?
ఇవన్నీ గాలి వార్తలు. ఇవాళ్టి మోడ్రన్‌ అమ్మాయిలు ఉన్నట్టు చేస్తాను అని ఉంటాను. దానికి రంగూ, రుచీ కలిపి వార్తలను అల్లేసి ఉంటారు. అంతేగానీ నా కట్టుబాట్లు. నియమాలు నాకున్నాయి.
బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచనల గురించి...?
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కలల్లో బతకడం నాకు తెలియదు. సినిమా పరిశ్రమకే వస్తానని అనుకోలేదు. వచ్చినా హైదరాబాద్‌లో అడుగుపెడతానని అనుకోలేదు. ఇవన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగాయి. అలాగే రేపేం జరుగుతుందో చూడాలి.
మీ సౌందర్య రహస్యం చెబుతారా...?
ఆరోగ్యవంతమైన ఆలోచనలే.
....TeluguOne-Cinema-Editorial
TeluguOne - CMS - Comments
   
Online-Shopping- teluguone.com
Send Home Appliances gifts