visionheights
Spicy Special
Movie Reviews
Cine News
Gossip
Titbits
Audio Songs
TV
Trailers
Articles
Interviews
Biography
Studio Roundup
Galleries
Wallpapers
Kingsize Photos
Drag Papers
Discover Images
Screen Savers
MP3 Audios
Vendithera
Gifts Shop
DVD Store
Sarasam
Vinodam
Grandalayam
 
send Dasara 2011 Special Gifts
Send Home Appliances gifts
Send Electronics N Durables gifts
Send Offer of the Day Gifts to India
send Dasara 2011 Special Gifts
 
Untitled Document
Tone Ads
puranalu
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
<< Back
 
దర్శకరత్న దాసరి నారాయణరావు (Dec 08 2008)
Telugu Cinema Biography దాసరి నారాయణరావు పాలకొల్లులో 1947మే నాలుగో తేదీన జన్మించారు. ఆయన ఏడో తరగతిలో ఉండగా తండ్రి చేసే పొగాకు వ్యాపారం దెబ్బతినడంతో కష్టాల పర్వం ప్రారంభమైంది. స్కూలు జీతం కట్టేస్థోమత లేకపోవడంతో ఏడో తరగతిలో తరగతులు మొదలైన రెండు వారాలకే చదువుకు స్వస్తి చెప్పి ఓ వ్రడంగి దగ్గర కూలి పనిలో చేరారు. ఆ వడ్రంగి దగ్గర పనిచేస్తుండగా చూసిన దాసరి క్లాసుటీచరు పాలకొల్లులోని కొందరు వైశ్యుల ఆర్థిక సహాయంతో ఆయన్ను చదివించారు. స్కూలు ఫీజులు వాళ్ళు కట్టినా పుస్తకాలకు డబ్బులు లేక స్నేహితుల ఇళ్ళకు వెళ్లి చదువుకునేవారాయన. అలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య పాలకొల్లు, ఎం.ఎం.కె.ఎన్‌. మునిసిపల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్లో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేశారు. స్కూల్లో ప్రతి ఏడాది అత్యధిక మార్కులతో ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందేవారు. క్లాస్‌లీడర్‌గా తర్వాత ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.తో మళ్ళీ చదువు ఆగిపోగా పాలకొల్లు నుండి హైదరాబాద్‌ వచ్చి కొంతకాలం చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు. ఆపైన నర్సాపురం కాలేజీలో బి.కాం. పూర్తి చేశారు. టైప్‌లో హయ్యర్‌ గ్రేడ్‌లో స్వర్ణపతకం, హిందీలో "విశారద" పొందారు. నర్సాపురం నుంచి కాకినాడ వెళ్ళి ఎస్‌.ఎస్‌. బ్రదర్స్‌ సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేసి, అదే సంస్త హైదరాబాద్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేశారు. తరువాత హైదరాబాద్‌లోని "హిందూస్థాన్ ఏరోనాటికల్స్‌"లో ఛీప్‌ సూపరింటెండ్‌కి కార్యదర్శిగా పనిచేశారు. ఈయనకు చిన్నతనం నుండే నాటకాలన్నా, సాహిత్యమన్నా అభిరుచి ఎక్కువ. ఏడో తరగతిలోనే "నేనూ-నా స్కూలు" అనే 15 నిమిషాల నాటిక రాశారు. 9వ తరగతి వచ్చే సరికి దాన్నే 45 నిమిషాల నాటికగా పెంచి రాశారు. దాన్ని అదే ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా టీచర్స్‌ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించగా, ఉత్తమనటుడు, ఉత్తమ రచయితగా అవార్డులు పొందారు. 1962లో ప్రణాళికా ప్రచారంపై రాష్ట్ర ఉత్తమనటుడిగా కూడా బహుమతి పొందారు. ఈయన ఈయన "పన్నీరు-కన్నీరు, పద్మశ్రీ, యదార్దవాది, ఏప్రిల్‌ఫూల్స్‌, నలిగినరోజా, దేశంకోసం" నాటకాలు రచించారు. 1960వ దశకంలో శ్రీ క్షీరారామ ఆర్ట్స్‌ థియేటర్‌ స్థాపించి, అనేక ప్రదర్శనలిచ్చారు. అది గమనించిన "హృషీకేశ్‌ పిక్చర్స్‌" అధినేత వై.వి. కృష్ణయ్య "అందం కోసం పందెం" చిత్రంలో ప్రధాన హాస్యనటుడి పాత్రను ఇచ్చారు. అప్పుడు మద్రాసు వెళ్లడానికి హెచ్‌.ఏ.ఎల్‌.లో రెండు నెలలు సెలవు అడిగితే ఇవ్వలేదు. దాంతో దాసరి నారాయణరావు ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వచ్చారు. ఆ పాత్రతో సరిపెట్టుకోకుండా ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టరుగా, ప్రొడక్షన్‌ మేనేజరుగా కూడా పనిచేశారు. ఆ సమయంలో హృషీకేశ్‌ పిక్చర్స్‌ మేనేజర్‌ నారాయణస్వామి దాసరి తపనను గమనించి నటుడిగా కంటే రచయితగా స్థిరపడమని సలహా ఇచ్చారు. అప్పుడు మద్రాసు వెళ్లడానికి హెచ్‌.ఏ.ఎల్‌.లో రెండు నెలలు సెలవు అడిగితే ఇవ్వలేదు. దాంతో దాసరి నారాయణరావు ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వచ్చారు. ఆ పాత్రతో సరిపెట్టుకోకుండా ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టరుగా, ప్రొడక్షన్‌ మేనేజరుగా కూడా పనిచేశారు. ఆ సమయంలో హృషీకేశ్‌ పిక్చర్స్‌ మేనేజర్‌ నారాయణస్వామి దాసరి తపనను గమనించి నటుడుగా కంటే రచయితగా స్థిరపడమని సలహా ఇచ్చారు. గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తాను తీస్తున్న "పానకాలు-పర్వతాలు" చిత్రానికి రచయితగా తొలి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి "మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌, జగత్‌కిలాడీలు, జగజ్జెట్టీలు, దేవాంతకులు, స్నేహబంధం" సినిమాలకు కథకుడిగా, సంభాషణల రచయితగా వ్యవహరించారు. గౌరి ప్రొడక్షన్స్‌లోనే "మా నాన్న నిర్దోషి" చిత్రానికి తొలిసారిగా సహకార దర్శకుడిగా పని చేశారు. ఆ పైన నందనరావు, లక్ష్మీ దీపక్‌ల వద్ద సహకార దర్శకుడిగా పని చేశారు. భీమ్‌ సింగ్‌ వద్ద స్థిరపడ్డ సమయంలోనే తొలిసారిగా "తాత-మనవడు" చిత్రానికి దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఈ చిత్రం విజయం సాధించడంతో దాసరి నారాయణరావు పరిశ్రమలో స్థిరపడ్డారు. 1973 నుండి 2000 వరకు దాసరి నారాయణరావు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమారు 50 చిత్రాల్లో నటించారు. 150 చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. తన భావాలను, ఆశయాలను ఇతరుల మీద ఉద్దకుండా తానే నిర్మాతగా మారి 1978లో "తారకప్రభు ఫిలింస్‌" సంస్థను స్థాపించి జయసుధ కథానాయకిగా "శివరంజన" చిత్రాన్ని నిర్మించారు. 1983లో "ఉదయం" పత్రికను, తర్వాత "శివరంజని, మేఘసందేశం" వంటి సినిమా పత్రికల్ని, "బొబ్బిలిపులి" లాంటి రాజకీయ పత్రికను నడిపారు. నారాయణరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన రవిరాజా పినెశెట్టి, కోడి రామకృష్ణ, కె. మురళీమోహన్‌రావు, రేలంగి నరసింహారావు, సత్యానాయుడు తర్వాత కాలంలో దర్శకులయ్యారు. దాసరి నారాయణరావు అనేక సంఘసేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 1975లో కాకినాడలో పోలీస్‌ సంక్షేమ నిధి కోసం స్టార్‌నైట్‌ నిర్వహించారు. 1982లో కాకినాడలో అదే నిధి కోసం ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌.లతో పాటు 60 మంతి తారలతో "దాసరి నైట్‌" నిర్వహించి రూ, 18 లక్షలు వసూలు చేసి ప్రభుత్వానికి అందించారు. పాలకొల్లులో దాసరి నారాయణరావు "ప్రబుత్వ మహిళా కళాశాల"ను నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. "చలనచిత్ర నిర్మాతల మండలి" అధ్యక్షుడిగా చాలాకాలం పని చేశారు. ఎనిమిదేళ్ళు "దక్షిణ భారత ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌"కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మద్రాసులో స్ఠిరపడిపోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను మన రాష్ట్రానికి తరలించటంలో జరిగిన ప్రయత్నానికి నాటి సారథిస్టూడియోస్‌ తొలి పునాది రాయి వేస్తే ఆ తర్వాత చాలా మంది చాలా పునాదిరాళ్లు వేశారు. చిట్టచివరిగా పరిశ్రమ సంపూర్ణగా తరలివచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడడానికి దాసరి నారాయణరావు కూడా దోహదం చేశారు. ఈయన నిర్మించిన "మేగసందేశం" చిత్రం (1983)లో కేంద్రప్రభుత్వ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందుకుంది. ఇదే చిత్రానికి రమేష్‌నాయుడుకి ఉత్తమ సంగీత దర్శకుడిగా, జేసుదాసుకి ఉత్తమ గాయకుడిగా, పి. సుశీలకి ఉత్తమ గాయనిగా కేంద్రప్రభుత్వపు జాతీయ అవార్డులు లభించాయి. 1986లో ఆంధ్ర యూనివర్శీటీ నుండి గౌరవ డాక్టరేట్‌, 1991లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు, జాతీయ అవార్డు రెండూ లభించాయి. 1986లో ఆంధ్ర యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ను, 1991లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య అవార్డును పొందారు. ఎన్‌.టి.ఆర్‌. అవార్డు కూడా పొందారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి "గిన్నీస్‌బుక్‌" రికార్డుల్లోకి ఎక్కారు. 1989లో రాజీవ్‌గాంధి ఆహ్వానం మేరకు క్రియాశీలక రాజకీయాలలో ప్రవేశించారు.
.... DMK
TeluguOne - CMS - Comments