Bhakti Home
monday tuesday wednesday thursday friday saturday sunday
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
Untitled Document
Untitled Document
:: Home :: Bhakti
Vishnu Sahasra Naamaavali
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon
icon Purva Peetika
icon Utara Peetika
icon Sri Vishnu Sahasra Naamaavali
icon Sri Vishnu Ashtotra Sathanaama Stotram
icon Sri Venkateswara Ashtotra SathaNaMavali
icon Nrusimha Stotram
icon Tiruppavai
icon Dasavathara Stuthi
icon Govinda Naamaavali
icon Hrudaya Kosha Vivarana
icon Purusha Suktham
icon Venkateswra Suprabatham
Audio
icon Venkateswara Suprabatam
icon
icon BajaGovindam Slokaalu
icon Nrusimaha Stotram
icon Sampurna Suprabatam
icon Sri Venkatesham
more devotional songs...
Sri Vishnu Sahasra Naamaavali
vishnu | puraanaam | shiva | brama | raja | raju | rupini | devathalu | indrudu | sarpa | ashwametha | swarajayam | hari | moksham.
వృత్రాసురుడు
పూర్వము త్వష్టయను ప్రజాపతికి సర్వజ్ఞుడైన విశ్వరూపుడను కొడుకు పుట్టెను .అతనికి మూడు తలలు . దేవత లతనిని గురువుగా భావించిరి .ఇంద్రుడతని యొద్ద, ''నారాయణ కవచము'' ఉపదేశము పొందెను. విశ్వరూపు డొక నోట సురాపానము, ఒక నోట సోమపానము చేయును. ముడవనోటితో అన్నం దినును . అతడు రాక్షసులకు గూడా యజ్ఞ భాగము లిప్పించుచుడగా ఇంద్రుడతని తలలు ఖండించెను .దానివలన అతనికి బ్రహ్మహత్యాదోషము కలిగెను.దానినొక ఏడు భరించి అది పోగొట్టుకోనుటకై ఇంద్రుడు , ఎంత గోయియ్యైనపూడునట్లు వరమిచ్చి భూమికి నలుగవంతు పాపమును,ఎన్ని కశ్మలములు చెరినను పవిత్రమగునట్లు వరమిచ్చినీటి కొక నాలుగవ వంతును ,ఎన్నిసార్లుకొట్టివేసినాను చిగిరించునట్లువరమిచ్చి చెట్లుకొకనాలుగవ వంతును , కామసుఖములతో పాటు సంతానము గూడా కలుగునట్లు వరమిచ్చి Vruthrasudu
స్త్రి ల కొక నాలుగవ వంతునుఅపాపమును పంచి ఇచ్చి తా నా బ్రహ్మహత్యాదోషమునుండి విముక్తుడయ్యేను. భూమికి చవిటినేలలు ,నీటికి నురుగు , చెట్లకు జిగురు , స్త్రిలకు రాజస్సును ఈ దోషము పంచుకోన్నందుకు గుర్తులు .

విశ్వరూపుని ఇంద్రుడు చంపుట చేత త్వష్టకు పుత్రశోకము గలిగెను .దానిని సహించలేక అతడి౦ద్రుని జంపు కొడుకు పుట్టవలేనని యజ్ఞము చేసెను. యజ్ఞకు౦డములో నుండి భయంకర రూపముతో రాక్షస డొకడు పుట్టెను .వాడే వృత్రుడు .బ్రహ్మను గూర్చి తపము చేసి వరములొంది లోకకంటకుడై ప్రవర్తి౦చెను .దేవత లతనిపైకి యుద్దమునకు రాగా వార౦దరను వృత్రుడోడించెను. ఇంద్రుడు యుద్దము చేయుచుండగా అతని చేతి ఆయుధము జరిపడెను .వృత్రుడింద్రునితో ,''ఆయుధములే వానిని ,పారిపోవు వానిని నేను చంపాను పొమ్ము ''ని విడిచిపెట్టెను.
దేవత లందరును శ్రీహరిని ప్రార్ధింపగా అయన ''దధీచిమహాముని అతని వెన్నుముక నడుగుడు .అయన దాత ,ఇచ్చును .దానితో విశ్వకర్మ ఇంద్రుని కాయుధము చేసి యిచ్చును .దానితో వృత్రుని ఇంద్రుడు చంపును ''అని చెప్పెను .దేవతలట్లే దధీచి నడిగిరి .అయన అది దేవకార్యమని గ్రహించి ''నేను యోగశక్తితో ప్రాణము విడుతును .నా ఎముకలు మీరు తీసుకుని ''డని యోగ మార్గమున శరీరము చాలించెను .విశ్వ కర్మ అయన వెన్నముకతో వజ్రాయుధము చేసి ఇంద్రుని కిచ్చెను .దేవత లుత్సహముతో వృత్రునిపై దండయాత్ర చేసిరి .ఆ మహా యుద్ధములో వృత్రుడు ఐరావతముతోను, వజ్రాయుధముతోను గూడా ఇంద్రుని మ్రింగి వేసెను .ఇంద్రుడు అతని కడుపు చీల్చి చంపి బయటకు వచ్చెను ,కానీ వృత్రుని చంపి మరల బ్రహ్మహత్యాపాతకము గట్టుకొన్న ఇంద్రుని ,దేవఋషి పితృగణములు విడిచిపోయిరి.

వారట్లేల ఇంద్రుని విదిచిపోయిరని పరిక్షిత్తు అడుగగా శుకడిట్లు చెప్పెను .
వృత్రపరాక్రమునకు భయపడి దేవతలు ,మునులు ఇంద్రునొద్దకు వచ్చి ''నీవు వృత్రసురును వధి౦పు ''మనగా అతడు ''పూర్వము ఇట్లే మీ మాటలు విని విశ్వరూపుని జంపినాను .ఆ దోషము పోగొట్టుకొనుటకు నాకు తలప్రాణము తోకకు వచ్చినది .మరల ఇంకొక బ్రహ్మహత్యకు ఒడిగట్టలే''నని నిరాకరించెను .దానికి మహర్షులు ''నీ చేత మే మశ్వమేధాయాగము చేయించి పాపవిముక్తిని జేయుదు''మని చెప్పి సురరాజును ఒప్పించిరి. అందుకే వృత్రుని జంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను.

ఆ పాపము ఒక చండాల స్త్రి రూపమున ఇంద్రుని వెంటబడెను .ఇంద్రుడు పారిపోయి మానససరస్సులోని తామర కాడలో దాగుకొనేను.అందున్న దారాలతో కలసిపోయి ఒక రూప మన్నది లేక వేయేండ్లు ఉండెను .అది శివునిదిక్కు (ఉత్తరము ).కాన చండాలి అచటికి పోలేక ఇంద్రునికై బయట కాచుకొని కూర్చుండేను.
అంతకాలము స్వర్గరాజ్య మరాజకము కాకూడదని , భూలోకము నుండినూ అశ్వమేధయాగములుచేసిన నహుషుడను రాజును దెచ్చి దేవతలు , ఋషులు ఇంద్రపదవిలో నిలిపిరి .అతడా పదవిలో మదించి , శచీదేవిని భార్యగా నుండమనినిర్బధించెను.ఆమె''బ్రహ్మర్షులు మోసేడు పల్లకిలోరమ్ము.నిన్నూవరి౦చెదను''ననెను .సహుషు డట్లేవచ్చును అగస్త్యుని''సర్ప-సర్ప''(దగ్గరకు సమీపింపుము)అని కాలితో దన్నేను.ఆముని కోపించి నీవు సర్పమై భూలోకమున బడియు౦డు ''మని శపించెను .దానితో నహుషుని ఇంద్రపదవి మట్టిలోగలిసేను.

ఇంద్రుడు డా పద్మనాళములో నుండి యిన్నేండ్లును హరిధ్యానము చేయుచుండేను.మునులును, దేవతలును ఇంద్రుడున్నచోట తెలిసికోని వచ్చి అతనిని మన్నించమని కోరి స్వర్గమునకుదేచ్చిరి.పాపరూపిణియైన చండాలి, అంతకాలము విష్ణుధ్యానము చేసిన ఇంద్రుని చేరలేకపోయేను. మునులింద్రుని చేత అశ్వమేధయాగము చేయి౦చి పాపవిముక్తిని జేసిరి.
ఈ వృత్రాసుర వధను జదివిన వారును వినినవారును అఖండ భోగభాగ్యాములతో తులతూగి , తుదకు మోక్షము నొందుదురు.
శత్రు వెంతవాడైనను ఉపేక్షి౦పరాదు,ఇది రాజనీతి .

పరిక్షిత్తు శకుని జూచి , ''మహాత్మా!అసురుడైన వృత్రున కంతటికీ ధర్మము జ్ఞానము ఏల కలిగినవి ?అని యడుగగా శుకమునీంద్రు
డిట్లుచెప్పెను.

 
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne