ఎప్పుడు కచేరిలో జరిగిన విషయాలన్నీ వైనంగా వివరిస్తూ లోపలోకి వచ్చే భర్త ఈ రోజు ఇలా చిటపటలాడుతూ ఉండటానికి కారణం ఏమిటబ్బా అనుకుంటు భర్త వెనుకనే లోపలికి నడిచి౦ది సోమిదమ్మ .
“ఏమైదండి అలా ఉన్నారు ? కచేరిలో జరుగరానిదేదన్న జరిగిందా?” అనుకుంటూ లోపలికి వచ్చింది సోమిదమ్మ .
వీధిలో తాను విన్నది,కన్నది,చూసింది అంతా అబద్దమైతే ఎంత బాగుండును అని అనుకున్నాడు మరింతగా యజ్ఞదత్తుడు. అంతగా కొడుకు మీద ఆశలు పెంచుకున్నాడు మరీ. ఇదీకాక కొడుకుతో పాటు భార్యకూడా తనను మోసగించిన విషయం అతనిని మరింత కలవరపరుస్తోంది.
అందుకే ఈ రెండు అసత్యాలైతే బాగుండుననే ఇంకా అతను ఆలోచిస్తున్నాడు .
కానీ,జరిగిన వాస్తవం జ్ఞాపకం వచ్చేసరికి మాత్రం కోపాన్ని దాచుకోలేక పోతున్నాడు .
ఈ సమయంలో భార్య లోపలికి వచ్చి మెత్తటి గుడ్డతో భర్త పాదాలను తుడుస్తూ ,విసినికర్రతో విసురుతూ నిలుచుని “ఏమైదండి “ అంటూ మరోసారి అడుగుతుంది .భార్యను చూడగానే ఆమె తనను మోసగిస్తున్న వైనం గుర్తుకువచ్చింది. అయినా “ఉహుం! ఏం లేదులే... ఆ రోజు నాకూ రాజుగారు ఇచ్చిన వజ్రపుటు౦గరం తీసుకురా , దాన్ని ధరించి ఇప్పుడు మధ్యాహ్న సంధ్య ఆచరించాలి ,అనంతరం అగ్నిహోత్రమునూ “అన్నాడు అతను నెమ్మదిగా .
“అబ్బో! ఇందుకేనా ఇంత కోపం ? ఆ ఉంగరం హాయిగా లోపల దంతపు పెట్టలో భద్రముగా ఉంది .అనుష్టానం,భోజనం ముగిసిన తరువాత దాన్ని వెలికి ధరించి కచేరికి వెలుదురుగాని,ఇప్పుడు చప్పున మీ కార్యక్రమాలు ముగించుకుని రండి “
అంటూ లోపలికి పోబోయి౦ది సోమిదమ్మ.
“సోమిదా!” అంటూ అరుస్తాడు యజ్ఞదత్తుడు .ఆ క౦ఠ౦లోని కర్కశత్వానికి ఒక్కక్షణం ఆ ఇల్లంతా కంపించిపోయింది . ఇక ఆ ఇల్లాలైతే నిలువెల్లా వణికిపోతూ ఒక్కసారి వెనుదిరిగి చూస్తుంది సోమిదమ్మ .కోపావేశంతో కదం తొక్కుతూ ఉంటాడా భర్త .అతడిని ఆ రూపంలో చూడడం ఆమెకు కొత్తగానే ఉంటుంది .ఎప్పుడైనా కోపం వస్తుందిగానీ ఇ౦తగా ఊగిపోవడం ఎప్పుడు చూడలేదు .దాంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు .
అయినా ఇంకా నచ్చచేప్పే౦దుకే ప్రయత్నిస్తూ”స్వామి ఈ రోజే౦దుకిలా ప్రవర్తిస్తున్నారు ? ఉంగరం లోపల ఉంది . ఇప్పటికే కాలాతీతమవుతోంది . మీ పనులు త్వరగా ముగించుకో౦డి”అంటూ సర్దిచెప్పబోయి౦ది.
|